common wealth: స్వర్ణ పతక విజేత వెంకట రాహుల్ కు విజయవాడలో ఘనస్వాగతం

  • గన్నవరం ఎయిర్ పోర్టులో రాహుల్ కు ఘనస్వాగతం
  • విమానాశ్రయానికి వెళ్లిన మంత్రి రవీంద్ర, రాహుల్ కుటుంసభ్యులు
  • రాహుల్ కు అభినందనల వెల్లువ

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ కు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఈ రోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ కు మంత్రి కొల్లు రవీంద్రతో పాటు అతని కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ కు కొల్లు రవీంద్ర అభినందనలు తెలిపారు.

కాగా, గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్  కామన్వెల్త్ గేమ్స్ లో 85 కిలోల విభాగంలో రాహుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. రాహుల్ ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం తరపున రూ.30 లక్షల నగదు ప్రోత్సహకాన్ని, 500 గజాల ఇంటి స్థలాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. గతంలో కూడా రాహుల్ కు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలందాయి. జనసేన పార్టీ తరపున కూడా రాహుల్ కు రూ.10 లక్షలను నజరానాగా ప్రకటించడం విదితమే.

common wealth
ragala venkat rahul
  • Loading...

More Telugu News