ntr: ఎన్టీఆర్ .. చరణ్ మల్టీ స్టారర్ బడ్జెట్ 300 కోట్లు!

  • మల్టీస్టారర్ మూవీ పనుల్లో రాజమౌళి
  • డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ - చరణ్ 
  • అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు  

రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీస్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో రాజమౌళి బిజీగా వున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. కథానాయికల అన్వేషణ కొనసాగుతోంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించాలనే ఆలోచనలో వున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ, ఈ సినిమా బడ్జెట్ గా 300 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. తనతో పాటు ఇతర టెక్నీషియన్స్ కి రాజమౌళి కథ చెప్పారనీ, ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని అన్నారు. బలమైన కథాకథనాలు .. భారీతనం .. ఎన్టీఆర్ - చరణ్ పాత్రలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయని చెప్పారు.   

  • Loading...

More Telugu News