High Court: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణను ఎత్తేసిన హైకోర్టు

  • ఇటీవల శాసనసభ నుంచి బహిష్కరణకు గురైన సభ్యులు
  • స్వామిగౌడ్‌పై దాడి చేశారని అభియోగాలు
  • శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం

కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వీరు అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వారి శాసన సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. వారిపై విధించిన ఈ బహిష్కరణను హైకోర్టు ఎత్తేస్తూ తీర్పునిచ్చింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌పై దాడి చేశారని సదరు ఎమ్మెల్యేలపై అభియోగాలు ఉన్నాయి. అయితే, తమ బహిష్కరణ వేటు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని వారు కొన్ని రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తమపై జరిగిన కుట్రలో అసెంబ్లీ స్పీకర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర ఉందని ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టుకు నివేదించి, తమకు నోటీసులు ఇవ్వకుండానే, బహిష్కరణ చేశారని పేర్కొన్నారు.

High Court
komatireddy
sampath kumar
  • Loading...

More Telugu News