mark zuckerberg: జుకర్ బర్గ్ వేతనం ఒక్క డాలరే... భద్రత కోసం మాత్రం 73 లక్షల డాలర్ల వ్యయం!

  • మార్క్ జుకర్ బర్గ్ కోసం సంస్థ భారీ వ్యయం
  • ఆయన భద్రత తమకు ముఖ్యమంటున్న కంపెనీ
  • 2017లో 50 శాతం పెరిగిన వ్యయాలు

ఫేస్ బుక్ ను తన స్వహస్తాలతో తీర్చిదిద్దిన మార్క్ జుకర్ బర్గ్ ఎంతో కష్టపడి పనిచేస్తూ తీసుకుంటున్న వేతనం ఒక డాలరే. సంస్థలో ఆయనకున్న వాటాల విలువ 6,600 కోట్ల డాలర్లు (రూ.4.29 లక్షల కోట్లు) ఉంటుంది. కనుక ఆయన వ్యక్తిగతంగా భారీ వేతనం తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే, ఇదే సమయంలో ఆయన భద్రత, ప్రయాణాల కోసం సంస్థ ఏకంగా 88 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.రూ.57 కోట్లు) ఖర్చు చేస్తోందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వివరాలను ఫేస్ బుక్ వెల్లడించింది.

జుకర్ బర్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై 73 లక్షల డాలర్లు, ఆయన వ్యక్తిగతంగా వినియోగించే విమానం కోసం 2017లో 15 లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. 2016లో ఇవే అవసరాల కోసం ఫేస్ బుక్ చేసిన వ్యయం 58 లక్షల డాలర్లే. కానీ ఏడాది తిరిగే సరికి ఆయనపై ఖర్చులు 50 శాతం పెరిగిపోయాయి. వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన జుకర్ బర్గ్ కు ఉన్న బెదిరింపుల దృష్ట్యా ఆయన భద్రత తమకు చాలా ముఖ్యమని కంపెనీ పేర్కొంది. కంపెనీ సీవోవో షెరిల్ శాండ్ బర్గ్ భద్రత కోసం కూడా 26 లక్షల డాలర్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News