wife harassed: భార్యను హింసిస్తున్న దృశ్యాల వీడియోను ఆమె పుట్టింటికి పంపి డబ్బులు డిమాండ్ చేసిన భర్త

  • పుట్టింటి నుంచి 50,000 రూపాయలు తెమ్మన్న భర్త
  • తీసుకురాలేనని చెప్పిన భార్య
  • చిత్ర హింసలకు గురి చేసి, బ్లాక్ మెయిల్ కు దిగిన వైనం 

అదనపు కట్నం కోసం భార్యను అత్యంత దారుణంగా హింసిస్తూ, ఆ దృశ్యాలను వీడియో తీసి, దానిని ఆమె పుట్టింటికి పంపాడో ప్రబుద్ధుడు. ఉత్తరప్రదేశ్‌ లోని షాజహాన్‌ పూర్‌ పోలీసులు తెలిపిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... తాను అడిగిన డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఒక భర్త భార్యను హెచ్చరించాడు. ఆ తరువాత పుట్టింటి నుంచి 50 వేల రూపాయలు తీసుకురావాలని భార్యను అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో రెచ్చిపోయి బెల్ట్ తో విపరీతంగా కొట్టి, 3 నుంచి 4 గంటల పాటు ఆమెను హింసకు గురిచేశాడు. దీంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమె రెండు చేతులను చున్నీతో కట్టేసి సీలింగ్‌ ఫ్యాన్‌ కు వేలాడదీశాడు.

 ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి, బాధితురాలి సోదరుడికి పంపాడు. తనకు డబ్బు తెచ్చి ఇస్తే సరి, లేని పక్షంలో ఇంకా చిత్రహింసలు చవిచూస్తుందని హెచ్చరించాడు. దీంతో ఆమె సోదరుడు ఆ వీడియోను పోలీసులకు చూపించి, కేసు నమోదు చేయించి, ఆమె ఇంటికి వెళ్లి విడిపించుకున్నాడు. దీనిపై బాధితురాలు మాట్లాడుతూ, ‘నేను చదువుకోలేదు. అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా జీవితం నాశనమైపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు స్పృహ వచ్చేసరికి సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ ఉన్నానని ఆమె తెలిపింది. దీంతో ఆమె భర్తతో పాటు అతని నలుగురు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చేపట్టారు.  

wife harassed
harassment
Uttar Pradesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News