nivetha peturaj: మీరు తలచుకుంటే లైంగిక వేధింపులు ఆగిపోతాయి!: నివేదా పేతురాజ్

  • నేను కూడా లైంగిక వేధింపుల బారినపడ్డాను
  • పేరెంట్స్ చాలా కేర్ ఫుల్ గా ఉండాలి
  • మీరు మమ్మల్ని కాపాడండి

మగవాళ్లు తలచుకుంటే లైంగిక వేధింపులు ఆగిపోతాయని సినీ నటి నివేదా పేతురాజ్ అభిప్రాయపడింది. సోషల్ మీడియా మాధ్యమంగా ఒక వీడియో పోస్టు చేసిన ఈ 'మెంటల్ మదిలో' సినిమా ఫేం.. తాను కూడా బాల్యంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని తెలిపింది. మన చుట్టూ ఉన్నవారు లేదా మన బంధువులు, వారూ కాకపోతే మనకు తెలిసినవారే లైంగిక వేధింపులకు పాల్పడతారని చెప్పింది. మన దేశం చాలా సమస్యలతో సతమతమౌతోందని చెప్పిన నివేద, అన్ని సమస్యలను పరిష్కరించలేకపోయినా కొన్నింటిని మనం పరిష్కరించుకోగలమని చెప్పింది. అందులో మొట్టమొదటిది ఉమన్‌ సేఫ్టీ అని తెలిపింది.

చిన్నప్పుడు తనపై జరిగిన లైంగిక దాడి గురించి తన తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదని అంది. అందుకే పేరెంట్స్ చాలా కేర్ ఫుల్ గా ఉండాలని చెప్పింది. పిల్లలతో కూర్చొని ఏం జరుగుతుందో అడిగి తెలుసుకోవాలని సూచించింది. స్కూల్‌ లో, ట్యూషన్‌ లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేమని తెలిపింది.

మేల్‌ ఫ్రెండ్స్‌ అందరికీ తాను చెప్పేదేంటంటే.. 'అమ్మాయిల కోసం మీరు చాలా చేస్తారు.. మనకు తెలిసిన వారు వీధుల్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గుర్తించండి.. మీరు వారికెలా సహాయపడగలరో అలా సహాయపడండి. ప్రతి దానికీ పోలీసుల మీద ఆధారపడలేం. అలాగని ప్రతి ఒక్కరినీ అనుమానించలేము. కనుక మీరు తల్చుకుంటే లైంగిక వేధింపులు, దాడులు ఆగిపోతాయి. నేను ప్రతి మగవాడ్ని కోరేదేంటంటే.. మీరు మమ్మల్ని కాపాడండి' అని పేర్కొంది. దీనికి నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News