Andhra Pradesh: జూన్ 2న ‘అన్న’ క్యాంటీన్లు ప్రారంభిస్తాం: ఏపీ మంత్రులు
- అతి తక్కువ ధరకే భోజనం, అల్పాహారం
- ఏపీ వ్యాప్తంగా ఈ క్యాంటీన్లు ప్రారంభిస్తాం
- 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభ వాయిదా
- వచ్చే నెల 10వ తేదీ లోగా నిర్వహిస్తాం
కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీ వ్యాప్తంగా జూన్ 2న ‘అన్న’ క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, పేదలకు అతి తక్కువ ధరకే భోజనం, అల్పాహారం అందించాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా దళిత తేజం ముగింపు సభ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ నెల 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభ వాయిదా పడిందని, వచ్చే నెల 10వ తేదీ లోగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని, మే నెలలో జిల్లాల్లో మినీ మహానాడు సభలు నిర్వహిస్తామని తెలిపారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: బోండా ఉమ
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విరుచుకుపడ్డారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్ర పన్నుల వాటా కాకుండా ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. విభజన హామీలన్నింటినీ నెరవేరుస్తామంటూ బీజేపీ నేతలు అబద్ధపు మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రకటనలు చేయడం తప్పా, ఏపీకి ఇచ్చిందేమీ లేదని, ఇచ్చిన ప్రతి పైసాకు కేంద్రం లెక్కలు చూపించాలని బోండా ఉమ డిమాండ్ చేశారు.