first visually impaired judge: హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందిన అంధుడు!

  • గ్లకోమా కారణంగా చూపు కోల్పోయిన బ్రహ్మానంద శర్మ
  • మేజిస్ట్రేట్ నియామక పరీక్షలో 83వ ర్యాంకు సాధించిన వైనం 
  • రాజస్థాన్ హైకోర్టు జడ్జీగా నియామకం

న్యాయచరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం. అంధుడైన వ్యక్తి తొలిసారిగా రాజస్థాన్ హైకోర్టు జడ్జీగా నియమితులు కావడం ఆసక్తి రేపుతోంది. రాజస్థాన్ లోని భిల్‌ వారా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన బ్రహ్మానందశర్మ (31).. 2013లో రాజస్థాన్ హైకోర్టు నిర్వహించిన న్యాయనియామక పరీక్షలో 83వ ర్యాంకు సాధించారు. అనంతరం హైకోర్టు అతడికి శిక్షణనిచ్చి చిత్తోర్‌ ఘడ్‌ లో పోస్టింగ్ ఇచ్చింది. అక్కడి నుంచి ఇటీవలే ఆయన అజ్మీర్ లోని సర్వార్‌ కు బదిలీ అయ్యారు. కాగా, బ్రహ్మానందశర్మ గ్లకోమాతో 22వ ఏట కంటిచూపును కోల్పోయారు.

 హైకోర్టు జడ్జ్ కావాలన్న లక్ష్యంతో తీవ్రంగా చదివేవారు. అది సరిపోదని భావించి వివిధ కోచింగ్ సెంటర్లను ఆశ్రయించగా, అంధత్వం కారణంగా తనకు శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్య సహకారంతో తాను జడ్జీని కాగలిగానని ఆయన చెప్పారు. తాను మేజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు ఒక అంధుడు తమకు ఎలా న్యాయం చేస్తాడని పలువురు అనుమానం వ్యక్తం చేసేవారని, అయితే తాను మాత్రం నిజానిజాలను పరిశీలించి కేసులు పరిష్కరించేవాడినని ఆయన చెప్పారు. 

first visually impaired judge
Brahmananda sharma
Rajasthan
  • Loading...

More Telugu News