manaka gandhi: కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం
- వడోదరలో అంబేద్కర్ విగ్రహానికి మేనకా గాంధీ నివాళి
- ఆమె రావడంతో విగ్రహం వద్ద కలుషితమైందన్న దళితులు
- పాలు, నీళ్లతో కడిగి ప్రక్షాళన
ఈ రోజు రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజకీయ నాయకులు నివాళులర్పించిన విషయం తెలిసిందే. అయితే, గుజరాత్లోని వడోదరలో తమ పార్టీ నేతలతో కలిసి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెళ్లిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది.
బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేయడంతో ఆ ప్రాంతమంతా కలుషితమైందని కొంత మంది దళితులు విగ్రహాన్ని పాలు, నీళ్లతో కడిగి ప్రక్షాళన చేశారు. కాగా, అంతకు ముందు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఠాకూర్ సోలంకి నేతృత్వంలోని దళితులు నినాదాలు చేశారు.