balakrishna: 'ఎన్టీఆర్' మూవీ కోసం విద్యాబాలన్ తో సంప్రదింపులు .. ఆమె కండిషన్స్ ఇవే!

  • తేజ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' మూవీ
  • బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ 
  • ఆమె గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్

'ఎన్టీఆర్' జీవితచరిత్రను రూపొందించడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. తేజ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ అయితే బాగుంటుందని భావించారు. విద్యాబాలన్ లోని నిండుదనం కారణంగా ఈ పాత్రకి ఆమె సరిగ్గా సెట్ అవుతుందనే నిర్ణయానికి వచ్చారు. రీసెంట్ గా ఆమెను కలిసి బసవతారకం పాత్రను గురించి వివరించారట.

బసవతారకం పాత్రను గురించి స్క్రిప్ట్ పరంగా తనకి ఏదైతే చెప్పారో .. అదే విధంగా చిత్రీకరించాలనీ, తనపై చిత్రీకరించిన ప్రతి సన్నివేశం సినిమాలో వుండాలంటూ విద్యాబాలన్ కండిషన్స్ పెట్టిందట. అందుకు ఈ సినిమా టీమ్ ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఇక విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అన్నమాట.  

balakrishna
vidyabalan
  • Loading...

More Telugu News