Andhra Pradesh: జగన్..కాపు రిజర్వేషన్ల కోసం ఎందుకు లాబీయింగ్ చేయట్లేదు?: బోండా ఉమ

  • అమరావతి, ‘పోలవరం’ నిర్మాణాలకు జగన్ అనుకూలమా? వ్యతిరేకమా?
  • కాపు రిజర్వేషన్లకు జగన్ అనుకూలమా? వ్యతిరేకమా?
  • సీఎం సీటు కోసం ప్రజల మనోభావాలతో జగన్ ఆడుకుంటున్నారు

ఏపీ అభివృద్ధి చెందడాన్ని చూసి వైసీపీ అధినేత జగన్ సహించలేకపోతున్నారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అమరావతికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు జగన్ అనుకూలమా? వ్యతిరేకమా? కాపు రిజర్వేషన్లకు జగన్ అనుకూలమా? వ్యతిరేకమా? కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ ఒక్కమాటైనా మాట్లాడలేదు. జగన్ తనపై ఉన్న అవినీతి కేసుల మాఫీ కోసం బీజేపీ వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. మరి, కాపు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు లాబీయింగ్ చేయట్లేదు? సీఎం సీటు కోసం ఐదు కోట్ల మంది మనోభావాలతో జగన్ ఆడుకుంటున్నారు’ అని ఉమ విమర్శించారు.

Andhra Pradesh
Bonda Uma
  • Loading...

More Telugu News