gold: తగ్గిన బంగారం, వెండి ధరలు

  • అక్షయ తృతీయ నేపథ్యంలో నిన్నటి వరకు డిమాండ్
  • ఈ రోజు డిమాండ్ లేమి
  • రూ.350 తగ్గి 10 గ్రా.ల బంగారం ధర రూ.31,800గా నమోదు
  • వెండి రూ.250 తగ్గి కేజీ ధర రూ.39,750గా నమోదు

అక్షయ తృతీయ నేపథ్యంలో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర కొన్ని రోజులుగా పై పైకి ఎగుస్తూ నిన్న పది గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.32,150గా నమోదైన విషయం తెలిసిందే. అయితే, పసిడి ధరల పెరుగుదలకు ఈ రోజు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా పెట్టుబడులు తగ్గడం, స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఈ రోజు పసిడి ధర అమాంతం రూ.350 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800కి చేరింది.

మరోవైపు నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్‌ తగ్గడంతో వెండి కూడా రూ.250 తగ్గి కేజీ వెండి ధర రూ.39,750గా నమోదైంది, కాగా, న్యూయార్క్‌ మార్కెట్లో పసిడి ధర 1.37 శాతం పడిపోయి ఔన్సు కి 1,334.30 డాలర్లుగా నమోదైంది. 

  • Loading...

More Telugu News