Tollywood: శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించిన ఎగ్జిక్యూటివ్ నిర్మాత వాకాడ అప్పారావు!

  • అమ్మాయిలను వాకాడ లైంగికంగా వేధించారన్న శ్రీరెడ్డి
  • ఆరోపణలను ఖండించిన వాకాడ అప్పారావు
  • అవకాశాలు లభించకనే విమర్శలని వెల్లడి

టాలీవుడ్ లో వందలాది మంది అమ్మాయిలను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు లైంగికంగా వేధించాడని, మెగాస్టార్ చిరంజీవి అండగా ఆయన రెచ్చిపోయారని నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై వాకాడ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలను ఖండించిన ఆయన, తన సినిమాల్లో అవకాశాలు ఇవ్వని కారణంగానే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై కక్ష కట్టిన కొందరు ఈ ప్రచారాన్ని ప్రారంభించారని, తాను వారిని ఎదుర్కొంటానని చెప్పారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎంతో మంది తన వద్దకు వస్తుంటారని, తాను ఎన్నడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.

Tollywood
Vakati Apparao
Executive Producer
  • Loading...

More Telugu News