charan: తెలుగులో 'రంగస్థలం' జోరు .. త్వరలో మిగతా భాషల్లోకి!

  • భారీ వసూళ్లతో 'రంగస్థలం' 
  • వసూళ్ల పరంగా 3వ స్థానంలో 
  • అనువాదంగా ఇతర భాషల్లోకి  

చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' .. తెలుగులో భారీ వసూళ్లను సాధిస్తూ తన జోరును కొనసాగిస్తోంది. దాంతో ప్రతి ప్రాంతంలోను మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 103 కోట్ల షేర్ ను సాధించింది. తెలుగులో అత్యంత వేగంగా .. అత్యధికంగా వసూళ్లను రాబట్టిన 3వ చిత్రంగా నిలిచింది.

తెలుగులో ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణ కారణంగా తమిళంలోను ఈ సినిమాను అనువదించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక హిందీ .. మలయాళ .. భోజ్ పురి భాషల్లోను ఈ సినిమాను అనువదించడానికి నిర్ణయించుకున్నారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ సినిమా  ఆయా భాషల్లోను సందడి చేయనుందన్న మాట.    

  • Loading...

More Telugu News