Allagadda: చంద్రబాబు హెచ్చరించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం: ఏవీ సుబ్బారెడ్డి

  • ఆళ్లగడ్డకు రావద్దని సుబ్బారెడ్డిని హెచ్చరించినట్టు వార్తలు
  • అవన్నీ నిజం కావు
  • అఖిలప్రియతో విభేదాలు చిన్నచిన్నవే
  • కలసి పనిచేసేందుకు సిద్ధమన్న సుబ్బారెడ్డి

ఇకపై ఆళ్లగడ్డలో కాలు పెట్టవద్దని సీఎం చంద్రబాబు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన వార్తలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఉదయం విజయవాడలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు చెప్పినట్టుగా ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

మంత్రి అఖిలప్రియకు, తనకు మధ్య విభేదాలు ఉన్నమాట నిజమేనని, అయితే, అవి చిన్నచిన్నవే తప్ప పెద్దవి కాదని అన్నారు. పార్టీ భవిష్యత్తు కోసం కలసి పని చేయాలని చంద్రబాబు సలహా ఇచ్చారని, ఆయన సలహాను పాటిస్తానని చెప్పారు. స్థానికంగా తనకు ప్రాధాన్యత తగ్గిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ పార్టీ కోసం అఖిల ప్రియతో కలసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబుకు స్పష్టం చేశానని అన్నారు.

Allagadda
Chandrababu
AV Subbareddy
Akhilapriya
  • Loading...

More Telugu News