Rangasthalam: 'రంగస్థలం' మొక్కు... కాలినడకన తిరుమలకు రామ్ చరణ్ భార్య ఉపాసన

  • తిరుమలకు నడిచి వెళ్లిన ఉపాసన
  • ఈ ఉదయం స్వామివారి దర్శనం
  • ట్విట్టర్ ఖాతాలో ఫొటోలు

తన భర్త రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా సూపర్ హిట్ కావడంతో కామినేని ఉపాసన కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం నడకను ప్రారంభించిన ఆమె, కొన్ని ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆపై ఈ ఉదయం ఆమె వీఐపీ బ్రేక్ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సిబ్బంది ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, రెండు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం' బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.

Rangasthalam
Ramcharan
Upasana
Tirumala
  • Loading...

More Telugu News