Andhra Pradesh: అమరావతి అభివృద్ధి కోసం 'మసాలా బాండ్లు' జారీ!

  • అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చుకునే పనిలో ఏపీ ప్రభుత్వం
  • మసాలా బాండ్ల ద్వారా నిధుల సేకరణ
  • తొలి విడతలో రూ. 500 కోట్ల సేకరణే లక్ష్యం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మసాలా బాండ్లను జారీ చేయనుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మసాలా బాండ్లు, పట్టణాభివృద్ధి నిధిపై అక్కడి బ్యాంకు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. రాజధాని నిర్మాణానికి తొలి విడతగా రూ. 500 కోట్ల సేకరణ లక్ష్యంతో సీఆర్డీయే ఆధ్వర్యంలో ఈ బాండ్లను జారీ చేయనున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందకపోవడంతో... రాష్ట్ర ప్రభుత్వమే వీలైనంత వరకు సొంతంగా నిధులను సమకూర్చుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే మసాలా బాండ్లను జారీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. 

Andhra Pradesh
amaravathi
masala bonds
Chandrababu
  • Loading...

More Telugu News