Sai: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • లిమిట్స్ తెలుసంటున్న సాయిపల్లవి 
  • సెన్సార్ కి వెళుతున్న మహేశ్ సినిమా 
  • రజనీ సినిమా ఇక జూన్ లోనే!
  • 'కర్ణ' స్క్రిప్టుకు శబరిమలలో పూజలు  

*  ఏ విషయంలోనైనా సరే ఎప్పుడూ తాను హద్దులలోనే ఉంటానని అంటోంది అందాలతార సాయి పల్లవి. "ఏ హీరోయిన్ కీ నేను పోటీ కాదు. నా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అందుకే ఏ విషయంలోనైనా సరే నేను లిమిట్స్ లోనే వుంటాను. ఎటువంటి పాత్రలు ఎంచుకోవాలన్నది నాకు బాగా తెలుసు" అని చెప్పింది.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రం ఈ రోజు సెన్సార్ కు వెళుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.
*  ఈ నెల 27న విడుదల కావలసిన రజనీకాంత్ చిత్రం 'కాలా' వాయిదా పడినట్టు సమాచారం. ప్రస్తుతం తమిళనాట నిర్మాతల మండలి నిరసనల కారణంగా చిత్ర ప్రదర్శనలను నిలుపుదల చేయడంతో ఇది వాయిదా పడింది. ఇక ఈ చిత్రాన్ని జూన్ నెలలో రిలీజ్ చేయచ్చని భావిస్తున్నారు.    
*  విక్రం హీరోగా మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ రూపొందించే 'మహావీర్ కర్ణ' చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం స్క్రిప్టును దర్శకుడు శబరిమల తీసుకెళ్లి అయ్యప్పస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.    

  • Loading...

More Telugu News