rahul dravid: ఇద్దరు క్రికెట్ దిగ్గజాలకు గాలం వేస్తున్న బీజేపీ!

  • కుంబ్లే, ద్రావిడ్ లకు బీజేపీ గాలం
  • చర్చలు జరిపేందుకు నేతల యత్నం
  • తిరస్కరించిన క్రికెట్ లెజెండ్స్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ లకు గాలం వేస్తోంది. వీరిద్దరి మద్దతు బీజేపీకి ఉంటే... యువ ఓటర్ల ఓట్లు తమకు పడతాయని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు వీరిద్దరితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుతం ద్రావిడ్ ఎన్నికల రాయబారిగా వ్యవహరిస్తున్నారు. కుంబ్లే గతంలో వన్యప్రాణుల మండలి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే బీజేపీ ఆహ్వానాన్ని ఇద్దరు క్రికెటర్లు తిరస్కరించినట్టు సమాచారం.  

rahul dravid
anil kumble
Karnataka
assembly
elections
BJP
  • Loading...

More Telugu News