sukumar: ఫస్టు ప్రాజెక్టుకే దిల్ రాజు మాట కాదన్నాను!: సుకుమార్

  • దిల్ రాజు గారు రీమేక్ చేద్దామన్నారు 
  • నేను రెడీ చేసిన కథనే చేస్తానని చెప్పాను 
  • అలా ఆడియన్స్ ముందుకు వచ్చిందే 'ఆర్య'  

తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "'దిల్' సినిమా సమయంలో వి.వి.వినాయక్ ద్వారా దిల్ రాజు గారు నాకు పరిచయమయ్యారు. వినాయక్ మాటల వలన నా దగ్గర టాలెంట్ ఉందని దిల్ రాజు భావించారు. దాంతో నాతో ఓ సినిమా చేయాలనుకున్నారు. అప్పటికే తమిళంలో హిట్ కొట్టిన ఒక తమిళ సినిమా కథను ఆయన కొనిపెట్టుకున్నారు"

"ఆ సినిమా చేద్దామంటూ ఆ స్క్రిప్ట్ ను దిల్ రాజు గారు నా ముందుకు తోశారు .. నేను ఆ స్క్రిప్ట్ ను వెనక్కి తోశాను. ఆయన ఆశ్చర్యంగా నా వైపు చూశారు .. రీమేక్ చేయనని చెప్పాను. ఫస్టు ఛాన్స్ మిస్ చేసుకోవద్దంటూ కో డైరెక్టర్ నాకు క్లాస్ పీకారు. అవసరమైతే మళ్లీ వెనక్కి వెళ్లిపోయి లెక్కలు చెప్పుకుంటానని అన్నాను. నేను తయారు చేసుకున్న కథనే డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. అర్థం చేసుకున్న దిల్ రాజు గారు అందుకు అంగీకరించడంతో .. 'ఆర్య' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది" అని చెప్పుకొచ్చారు సుకుమార్.    
 

  • Loading...

More Telugu News