inter: రేపు ఉదయం తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు

  • విడుదల చేయనున్న కడియం శ్రీహరి
  • నాంపల్లి ఇంటర్‌ బోర్డు ఆఫీసు నుంచి విడుదల
  • ఫలితాలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్ల వివరాలు వెల్లడి

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి గత నెలలో నిర్వహించిన ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ రోజు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యాలయంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేస్తారని అందులో పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలను న్యూస్‌ పేపర్లలోనూ ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు ఈ వెబ్‌సైట్లు లేక యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.    

  • Loading...

More Telugu News