unnao: 'ఉన్నావో అత్యాచార' నిందిత ఎమ్మెల్యేపై కేంద్ర మంత్రి ఆగ్రహం

  • అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు
  • అలాంటి వారి వల్ల మహిళలకు భద్రత ఉండదు
  • ఆయన జైలులో ఉండడమే సరైనది

'అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు' అంటూ బాలికపై అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉన్నావో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ నెగ్గార్‌ పై కేంద్ర మంత్రి, ఫైర్‌ బ్రాండ్ ఉమాభారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో ఆమె మాట్లాడుతూ, అలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో మహిళలకు భద్రత ఉండదని అన్నారు. ఆయన లాంటి వ్యక్తులు దేశంలోనే కాకుండా, ఈ సమాజంలో కూడా ఉండేందుకు వీల్లేదని అన్నారు. ఆయన జైలులో ఉండడమే సరైనదని ఆమె అభిప్రాయపడ్డారు. 

unnao
rapist mla
Uttar Pradesh
  • Loading...

More Telugu News