Pawan Kalyan: నిరాహారదీక్షపై కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్!

  • ప్రత్యేక హోదాపై కీలక ప్రకటన చేయనున్న పవన్
  • ఆమరణదీక్షపై కూడా ప్రకటన వెలువడే అవకాశం
  • కాసేపట్లో వామపక్ష నేతలతో భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక హోదాపై ఆయన కీలక ప్రకటన చేయనున్నారని, అవసరమైతే ఆమరణదీక్ష చేస్తానని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాదులో కాసేపట్లో ఆయన వామపక్ష నేతలతో భేటీ కానున్నారు. వారితో కలసి భవిష్యత్ కార్యాచరణపై పవన్ చర్చించనున్నట్టు సమాచారం.

ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో కలసి ఆందోళన కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో వామపక్షాలతో కలసి పాదయాత్రను సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో, పవన్ నుంచి కీలక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.


Pawan Kalyan
special status
left parties
hunger strike
  • Loading...

More Telugu News