csk: చెన్నై ఫ్యాన్స్ తరపున క్రికెటర్లకు క్షమాపణలు చెప్పిన సినీ నటి కస్తూరి

  • స్టేడియంలోకి చెప్పులు విసిరిన నిరసనకారులు
  • ఆ చెప్పులను బయటకు విసిరేసిన డుప్లెసిస్, జడేజా
  • క్షమాపణలు చెప్పిన చెన్నై ఫ్యాన్స్

ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) - కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై తమిళనాడు క్రికెట్ అభిమానుల తరపున రచయిత, విశ్లేషకురాలు, ప్రముఖ సినీ నటి కస్తూరి శంకర్ క్షమాపణలు చెప్పారు. కావేరీ జల వివాదం నేపథ్యంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణను తమిళులు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ ను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు 4000 మంది పోలీసులతో చేపాక్ స్టేడియంకు భద్రత కల్పించారు.

 అయినప్పటికీ పలువురు అభిమానులు స్టేడియంలోకి చెప్పులు విసరగా, బౌండరీలైన్ బయట ఉన్న డుప్లెసిస్, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా వాటిని బయటకు విసిరేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన కస్తూరి.. డుప్లెసిస్‌, జడేజాలను ట్యాగ్‌ చేస్తూ, క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత పలువురు అభిమానులు వారిని ట్యాగ్ చేస్తూ, ‘మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాం. మా గురించి తప్పుగా భావించొద్దు. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉంది.’ అంటూ ట్వీట్లు చేశారు.

csk
kkr
chidambaram stadium
  • Error fetching data: Network response was not ok

More Telugu News