natti kumar: త్వరలోనే 'నందమూరి తారకరామారావు ఆత్మఘోష' సినిమా: నిర్మాత నట్టి కుమార్

  • సినీ పరిశ్రమలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయి
  • నటీనటులకు సభ్యత్వం ఇచ్చే అధికారం మాత్రమే 'మా'కు ఉంది
  • ఫిల్మ్ నగర్ లో అడుగు పెట్టకుండా బహిష్కరించే హక్కు లేదు

సినీ పరిశ్రమలో ఒంటెద్దు పోకడలు నెలకొన్నాయని నిర్మాత నట్టి కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కొందరు సినీ పెద్దలు కలిశారని... మీ వెనుకే పరిశ్రమ మొత్తం ఉందని చెప్పారని... మా అందరి అభిప్రాయాలను తీసుకోకుండానే వారు ముఖ్యమంత్రిని ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక డేట్ ఫిక్స్ చేసి, అందరినీ తీసుకెళ్లి ఉంటే బాగుండేదని అన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పై కూడా నట్టి కుమార్ మండిపడ్డారు. నటీనటులకు సభ్యత్వం ఇవ్వడం వరకే 'మా'కు అధికారం ఉంటుందని... ఫిల్మ్ నగర్ లోకి హీరోయిన్ శ్రీరెడ్డి లాంటి వారిని రాకుండా అడ్డుకోవడం వాళ్ల చేతిలో ఉండదని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలోని లోపాలను ఆమె ఎత్తి చూపుతున్నప్పుడు... తప్పులను సరిదిద్దుకోవాలని... అలా కాకుండా, ఆమె పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం పరిశ్రమకు మంచిది కాదని చెప్పారు. త్వరలోనే తాను 'నందమూరి తారకరామారావు ఆత్మఘోష' అనే చిత్రాన్ని తీస్తానని వెల్లడించారు. 

natti kumar
producer
Tollywood
sri reddy
Chandrababu
maa
  • Loading...

More Telugu News