ISRO: చంద్రయాన్-2కు ముహూర్తం కుదిరింది... వరుస ప్రయోగాలతో పరుగులు పెడతాం: ఇస్రో

  • డిసెంబర్ లోగా చంద్రయాన్-2
  • 8 నెలల్లో 9 ప్రయోగాలు చేస్తాం
  • వెల్లడించిన ఇస్రో చైర్మన్ శివన్

ఈ ఏడాది డిసెంబర్ లోగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ శివన్ వ్యాఖ్యానించారు. ఈ తెల్లవారుజామున జరిగిన పీఎస్ఎల్వీ సీ 41 విజయవంతంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకోగా, మీడియాను ఉద్దేశించి శివన్ మాట్లాడారు. నావిగేషన్ చరిత్రలో నవ శకానికి నాంది పలికామని, ఇకపై భూమితో పాటు సముద్రంలో ప్రయాణించే వారికీ దిక్సూచిగా ఈ శాటిలైట్ ఉపకరిస్తుందని చెప్పారు.

వచ్చే 8 నెలల వ్యవధిలో 9 ప్రయోగాలు చేయనున్నామని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు వరుస ప్రయోగాలతో బిజీ కానున్నారని పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ కమ్యూనికేషన్ మార్క్ -3 ఉపగ్రహాన్ని త్వరలో నింగిలోకి పంపుతామని ఆయన తెలిపారు. ఇండియాలో నావిగేషన్ సేవల కోసం త్వరలోనే ఇస్రో ఓ ప్రత్యేకమైన యాప్ ను విడుదల చేయనుందని, దీని సాయంతో చాలా సులువుగా గమ్యాన్ని చేరుకోవచ్చని అన్నారు.

ఇదిలావుండగా, శాటిలైట్ ప్రయోగంలో విజయం సాధించిన శాస్త్రవేత్తలకు వైకాపా అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. భారత శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News