Sri Reddy: శ్రీరెడ్డిని టీవీ9 రవిప్రకాష్ గెస్ట్ హౌస్ కు పిలిచారంటూ వాట్సాప్ స్క్రీన్ షాట్స్... ఫేక్ అని తేల్చి ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు!

  • నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్ షాట్స్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీవీ9 అడ్మిన్
  • గుడ్ల శివకుమార్ రెడ్డి బాధ్యుడని తేల్చిన పోలీసులు

తెలుగు సినీ నటి శ్రీరెడ్డికి, టీవీ చానల్ టీవీ9 'చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్' రవిప్రకాష్ కూ మధ్య సంబంధముందని, రవిప్రకాష్, శ్రీరెడ్డిని గెస్ట్ హౌస్ కు పిలిచాడని ఉన్నట్టుగా వాట్స్ యాప్ స్క్రీన్ షాట్స్ నిన్న విడుదలై కలకలం రేపగా, టీవీ9 అడ్మిన్ పోలీసులను ఆశ్రయించారు.

కేసుపై విచారించిన పోలీసులు గుడ్ల శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి అసభ్యకర సంభాషణలను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడని తేల్చి అరెస్ట్ చేశారు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసులకు అప్పగించనున్నట్టు వెల్లడించారు. కాగా, టీవీ9 రవిప్రకాష్ కు, తనకు మధ్య జరిగినట్టుగా ప్రచారమవుతున్న సంభాషణ ఫేక్ అని శ్రీరెడ్డి సైతం తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టింది.

Sri Reddy
TV9
Ravi Prakash
Fake
Screen Shots
  • Error fetching data: Network response was not ok

More Telugu News