naini: 15,200 మందితో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి విశ్వగురు వరల్డ్ రికార్డ్

  • ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో నిర్వహణ
  • రామ్ నగర్ డివిజన్ కార్పోరేటర్ వీ శ్రీనివాస్ రెడ్డికి అవార్డు
  • నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ప్రదానం

ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లోని రామ్ నగర్ డివిజన్‌లో 'స్వచ్ఛ సర్వేక్షణ్' కార్యక్రమంలో భాగంగా 15,200 మంది విద్యార్థులు, నగరవాసులు పాల్గొని ఏక కాలంలో రోడ్లు శుభ్రపర్చారు. ఇందుకు గానూ నిర్వాహకులు రామ్ నగర్ డివిజన్ కార్పోరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డికి ఈ రోజు విశ్వగురు వరల్డ్ రికార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యవోలు రాంబాబు.. తెలంగాణ హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డు అందించారు.

మంచి కార్యక్రమాలు చేస్తోన్న వారిని గుర్తించి, రికార్డులు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని, సమాజంలో వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉంటాయని విశ్వగురు నిర్వాహకులను మంత్రి నాయిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ డైరెక్టర్ పూజిత, మేరిలాండ్ ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ డైరెక్టర్ డేనియల్ రాజ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News