ashok gajapathi raju: అశోక్ గజపతిరాజుకు క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా

  • నిన్న ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అశోక్ గజపతి రాజు
  • బ్యాగేజీలో ఒక బ్యాగ్ మిస్
  • క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా

మొన్నటి వరకు భారత విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుకు ఎయిరిండియా సిబ్బంది షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం భార్య, కూతురు, సోదరితో కలసి ఎయిరిండియా-451 విమానంలో ఆయన ఢిల్లీ నుంచి విశాఖపట్నం బయల్దేరారు. ఈ సందర్భంగా 9 బ్యాగులను లగేజీలో బుక్ చేశారు. తీరా విశాఖ చేరుకున్నాక లగేజీలో ఒక బ్యాగ్ మిస్ అయింది.
ఈ విషయాన్ని ఆయన ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, వారు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఎయిరిండియా యాజమాన్యం అశోక్ కు క్షమాపణలు చెప్పింది. లగేజీని జాగ్రత్తగా చేరుస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఎయిరిండియా నిర్వాకంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మాజీ విమానయాన శాఖ మంత్రికే ఇలా జరిగితే... సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ashok gajapathi raju
air india
luggage
baggage
miss
  • Loading...

More Telugu News