roja: విశ్వ విఖ్యాత 'పప్పు' సార్వభౌమ: నారా లోకేశ్‌ను ఎద్దేవా చేసిన రోజా

  • లోకేశ్‌కి సూట్‌కేసు ఇస్తేనే పనులు జరుగుతాయి
  • ఆనందనగరం సదస్సులు చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట
  • ఏపీలో యువతకు జాబులు లేవు
  • రైతులు అప్పుల్లో మునిగిపోయారు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విశ్వ విఖ్యాత పప్పు సార్వభౌమ అంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు సూట్‌కేసు ఇస్తేనే పనులు జరుగుతాయని ఆరోపించారు. ఓటేసిన ప్రజలు ఆయన వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళితే పనులు జరగవని, పనుల కోసం డబ్బు ఇస్తేనే ఆయన సంతకాలు పెడతారని అన్నారు.

ఈ రోజు హైదరాబాద్‌లోని తమ పార్టీ కార్యాలయంలో రోజా మాట్లాడుతూ... ఆనందనగరం సదస్సులు జరపడం సీఎం చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట అని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని, యువతకు జాబులు లేవని, రైతులు అప్పుల్లో మునిగిపోయారని రోజా అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని అన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారని చంద్రబాబు అనుకుంటే ఇప్పుడే ఎన్నికల్లోకి పదండని ఆమె సవాలు విసిరారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఎన్నికల్లోకి రావాలని, అలాగే రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లోకి దిగాలని రోజా అన్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు, ఓటుకు నోటు కేసు మాఫీ కోసమే చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు.  

  • Loading...

More Telugu News