YSRCP: వైసీపీ ఎంపీల రాజీనామాలపై రామ్మోహన్ నాయుడి వ్యంగ్యాస్త్రాలు!

  • వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ సభ్యులతో కూడా రాజీనామాలు చేయించాలి
  • అవిశ్వాసంపై ఇతర పార్టీల మద్దతును ఎందుకు కోరలేదు?
  • వైసీపీ ఎంపీలది నాటకమే

వైసీపీ లోక్ సభ సభ్యులు చేసిన రాజీనామాలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వైసీపీ ఎంపీలది నాటకమని ఆయన కొట్టిపడేశారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ సభ్యులతో కూడా రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి ఇతర పార్టీల మద్దతును వైసీపీ ఎందుకు కోరలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పూలే జయంతిని నిర్వహించే హక్కు లేదని చెప్పారు. టీడీపీ ఎంపీలు చేపట్టనున్న చైతన్య యాత్రల తర్వాత... బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

YSRCP
mps
resignation
ram mohan naidu
Telugudesam
  • Loading...

More Telugu News