akhil: అఖిల్ మూవీలోనూ పూజా హెగ్డే!

  • ఎన్టీఆర్ తాజా చిత్రంలో ఛాన్స్
  • మహేశ్ 25వ మూవీలో అవకాశం 
  • అఖిల్ మూవీలో స్పెషల్ సాంగ్    

'దువ్వాడ జగన్నాథం'లో గ్లామర్ మెరుపులతో కుర్రకారు మనసులను కొల్లగొట్టేసిన పూజా హెగ్డే, తన క్రేజ్ ను అమాంతంగా పెంచేసుకుంది. దాంతో అగ్ర దర్శక నిర్మాతల దృష్టి ఆమెపై పడింది. తమ సినిమాల్లోకి ఆమెను తీసుకోవడానికి వాళ్లు ఆసక్తిని చూపుతున్నారు. అగ్ర హీరోలు కూడా తమ సినిమాలో ఆమెనే హీరోయిన్ అంటే ఓకే అనేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలోను .. మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి మూవీలోను .. రాధాకృష్ణ - ప్రభాస్ సినిమాలోను ఆమె అవకాశాలను చేజిక్కించుకుంది. ఇక తాజాగా అఖిల్ మూవీలోను కనిపించనుందని అంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూవీ రూపొందనుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోను ఒక ప్రత్యేకమైన సాంగ్ లో పూజా హెగ్డే కనిపించనుందని అంటున్నారు. 'రంగస్థలం'లో 'జిగేల్ రాణి ..' తరహాలో ఈ సినిమాలో ఈ అమ్మడు అఖిల్ తో కలిసి అదరగొట్టేయనుందన్న మాట.    

  • Loading...

More Telugu News