Sri Reddy: శ్రీరెడ్డి చెబుతున్న పేర్లతో టాలీవుడ్ లో ప్రకంపనలు... దగ్గుబాటి సురేష్, హీరో వెంకటేష్ స్పందించాలని మహిళా సంఘాల డిమాండ్!

  • హీరోయిన్స్ కు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన శ్రీరెడ్డి
  • తాజాగా దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్, దిల్ రాజు పేర్లు
  • శ్రీరెడ్డికి మహిళా సంఘాల మద్దతు
  • పోలీసులు సుమోటోగా విచారించాలని డిమాండ్

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన నటి శ్రీరెడ్డి చెబుతున్న పేర్లు, మీడియాకు ఇస్తున్న సాక్ష్యాలు టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. గతంలో జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసే ఏజంట్లు, హీరోయిన్ల మేనేజర్లు, గాయకుల పేర్లను బయటపెట్టిన ఆమె, తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్ పేరును, మరో నిర్మాత దిల్ రాజు పేరును బయట పెట్టడం సంచలనంగా మారింది. అభిరామ్ తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోను ఓ టీవీ చానల్ లో బయటపెట్టిన శ్రీరెడ్డి, అతను ఓ దుర్మార్గుడని, ఎందరినో నాశనం చేశాడని చెప్పి వాపోయింది. దిల్ రాజును టార్గెట్ చేస్తూ, ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టి, అతను చస్తే టాలీవుడ్ కు పట్టిన శని వదిలిపోతుందని వ్యాఖ్యానించింది.

వీరిద్దరి పేర్లనూ బయట పెట్టిన తరువాత శ్రీరెడ్డికి మహిళా సంఘాలు, సామాజిక వేత్తల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆమె పోరాటానికి మద్దతు పలుకుతామని ఐద్వా తదితర మహిళా సంఘాలు స్పష్టం చేశాయి. ఇంతకాలం ఆమె చేసిన పోరాటం ఓ ఎత్తయితే, ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు, కనిపిస్తున్న సాక్ష్యాలు మరో ఎత్తని మహిళా ఉద్యమకారులు అంటున్నారు.

ఇప్పుడు తప్పనిసరిగా అభిరామ్ తండ్రి దగ్గుబాటి సురేష్, బాబాయి వెంకటేష్ లు శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రక్షాళనకు కదలాలని అంటున్నారు. కాగా, తన వద్ద మరిన్ని సాక్ష్యాలున్నాయని, ఒక్కొక్కరి పేరునూ బయట పెడతానని శ్రీరెడ్డి హెచ్చరిస్తూ ఉండటంతో, గతంలో ఆమెతో సంబంధాలు పెట్టుకున్న వారిలో ఆందోళన పెరుగుతోంది.

Sri Reddy
Tollywood
Daggubati Suresh
Daggubati Abhiram
venkatesh
  • Loading...

More Telugu News