whatsapp: వాట్సాప్ ను నడిపించే వ్యక్తి కావాలట... భారత్ లో సారధి కోసం ప్రకటన

  • కనీసం 15 ఏళ్ల అనుభవం
  • కంపెనీ ప్రణాళికలను ముందుండి నడిపించాలి
  • అసాధారణ వ్యక్తి అయి ఉండాలంటూ ప్రకటన

వాట్సాప్ ను ప్రపంచంలో 130 కోట్ల మంది వినియోగిస్తుంటే... ఒక్క భారత్ లోనే 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. భారత్ వాట్సాప్ కు కీలకమైన మార్కెట్ గా అవతరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో కంపెనీని నడిపించే బాస్ కావాలంటూ ఆ సంస్థ ప్రకటించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తూ క్యాలిఫోర్నియాలో ఉండే వాట్సాప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని ఆ ప్రకటన సారాంశం.

 ‘‘భారత్ లో వాట్సాప్ లో చేపట్టిన ఉత్పత్తులు, వ్యాపారం, పీర్ టు పీర్ పేమెంట్స్ వంటి  ప్రణాళికలను ముందుండి నడిపించే అసాధారణ వ్యక్తి కోసం చూస్తున్నాం. ఇది సీనియర్ నాయకత్వ పదవి. ఉత్పత్తుల అనుభవంతోపాటు, వ్యాపారాలను విజయవంతంగా నడిపించిన ట్రాక్ రికార్డు ఉండాలి’’ అని వాట్సాప్ పేర్కొంది. కనీసం 15 ఏళ్ల పాటు ఉత్పత్తుల కంపెనీలను నడిపించిన అనుభవం, పేమెంట్ టెక్నాలజీ కంపెనీల్లో 5 ఏళ్ల అనుభవం ఉండాలని వాట్సాప్ తెలియజేసింది.

  • Loading...

More Telugu News