Uttarakhand: ఓ బాలిక కోసం ప్రముఖ బాయ్స్ స్కూల్ తొలిసారి రూల్స్ బ్రేక్ చేసింది!

  • అటెండెన్స్ చాలకపోవడంతో షకీనా ముఖియాను ప్రమోట్ చేసేందుకు నిరాకరించిన సెయింట్ థామస్ స్కూల్  
  • కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ బాయ్స్ స్కూల్ లో షకీనా ముఖియాకు అడ్మిషన్
  • ‘వాయిస్‌ ఇండియా కిడ్స్‌’ రియాలిటీ సింగింగ్ కాంపిటీషన్ ద్వారా సుపరిచితురాలైన షకీనా  

92 ఏళ్లుగా కేవలం బాలురకు మాత్రమే విద్యాబుద్దులు నేర్పుతున్న బాయ్స్ స్కూల్ తొలిసారి రూల్స్ అతిక్రమించింది. మాజీ ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (వీపీ సింగ్), బాలీవుడ్ నట దిగ్గజం రాజ్‌ కపూర్‌ వంటి వారు చదివిన డెహ్రాడూన్ కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ బాయ్స్ స్కూల్ లో తొలిసారి ఒక బాలికకు అడ్మిషన్ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌ లోని సెయింట్ థామస్ స్కూల్ లో ‘వాయిస్‌ ఇండియా కిడ్స్‌’ రియాలిటీ సింగింగ్ కాంపిటీషన్ ద్వారా పరిచయమైన షకీనా ముఖియా 6వ తరగతి వరకు చదువుకుంది. అటెండెన్స్ లేకపోవడంతో ఆమెను తరువాతి తరగతికి ప్రమోట్ చేసేందుకు ఆ స్కూలు యాజమాన్యం అంగీకరించలేదు.

తాను స్కూల్ కి హాజరుకానంత మాత్రాన చదవడం ఆపలేదనేది షకీనా వాదన. అయితే ఆమె ఎంత చురుకైన విద్యార్థి అయినప్పటికీ నిబంధనలను అతిక్రమించలేమని, ఆమె మళ్లీ అదే తరగతి చదవాల్సిందేనని యాజమాన్యం చెబుతోంది. దీంతో షకీనా తల్లిదండ్రులు కల్నల్‌ బ్రౌన్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ యాజమాన్యాన్ని సంప్రదించారు. వారు సుదీర్ఘంగా ఉన్న ‘ఓన్లీ బాయ్స్‌’ నిబంధనను పక్కకు పెట్టి షకీనాకు ప్రవేశపరీక్ష పెట్టారు. ఇందులో పాస్ కావడంతో ఆమెకు సీట్ ఖరారు చేశారు. అబ్బాయిలు ధరించిన యూనిఫామ్ ధరించాల్సి ఉంటుందని స్కూలు తెలిపింది.   

  • Loading...

More Telugu News