Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సమంత బాగా టెన్షన్ పడుతుందట! 
  • జపాన్ లో సెంచరీ కొట్టిన 'బాహుబలి-2' 
  • ఆస్ట్రేలియాలో మహేశ్ సినిమా రికార్డ్ 
  • మరోసారి పోలీస్ వేషంలో రవితేజ

*  తన సినిమా విడుదల ముందు రోజు రాత్రి కథానాయిక సమంత తాను నిద్రపోదు, తన వాళ్లని ఎవర్నీ నిద్రపోనివ్వదట. "అవును, నాకు చాలా టెన్షన్ పట్టుకుంటుంది. అందుకే నిద్ర పట్టదు. ఆ టెన్షన్లో అందరికీ ఫోన్లు చేస్తుంటాను. అర్ధరాత్రి ఫోన్ చేసి, 'మన సినిమా ఆడుతుందంటావా?' అంటూ ఒకటే నస పెట్టేస్తాను. నా టెన్షన్ అలా వుంటుంది మరి" అని చెప్పుకొచ్చింది.
*  దేశ విదేశాల్లో సంచలన వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకున్న 'బాహుబలి 2' చిత్రం జపాన్ లో కూడా తన సత్తా చాటుతోంది. గత డిసెంబర్ 29న అక్కడ రిలీజైన ఈ చిత్రం తాజాగా 100 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుని భారీ వసూళ్లను రాబడుతోంది.
*  మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అమెరికాలో 2000 ప్రీమియర్ షోలు వేస్తుండగా.. ఆస్ట్రేలియాలో గతంలో ఎన్నడూ లేని విధంగా 45 లొకేషన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
*  రవితేజ మరోసారి పోలీస్ గెటప్ వేస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. తమిళంలో వచ్చిన 'తేరి' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో రవితేజ పోలీస్ వేషం వేయనున్నాడు.  

  • Loading...

More Telugu News