Undavalli: ఈ రాష్ట్రం బాగు పడాలంటే ఆ ఒక్కటీ జరిగితే చాలు: ఉండవల్లి అరుణ్ కుమార్‌

  • డబ్బు ఖర్చు పెట్టిన వారు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవాలి
  • డబ్బు ఇచ్చిన వారికి ప్రజలు ఓటు వేయకూడదు
  • ఎన్నికల కోసం ఏపీలో రెండు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి
  • ఒక్కో ఓటరుకు రూ.2000 చొప్పున ఇస్తాయి

'అధికార పార్టీ వైఫల్యాలకు ప్రతి పక్ష పార్టీయే కారణమని గతంలో ఎప్పుడైనా ఏ పార్టీ అయినా చెప్పడం మనం ఎప్పుడైన విన్నామా?' అని సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలకు జగన్ పార్టీ వైపీపీయే కారణమని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నారని అన్నారు. ఈ రోజు ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా మన వ్యవస్థ నడుస్తోందని, మనది ఫెడరల్ వ్యవస్థ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, మనది ఫెడరల్ వ్యవస్థ కాదని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అన్నారు. మన వ్యవస్థ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని అన్నారు.

ఓ విషయానికి కొంత మంది వ్యతిరేకం, కొంతమంది అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఉద్యమం చేస్తారని, అప్పట్లో తెలంగాణ, సమైక్యాంధ్ర పోరాటాలు ఇదే తీరులో జరిగాయని, అటువంటి వాటిని ఉద్యమాలు అంటారని అన్నారు. ప్రత్యేక హోదాకు బీజేపీ తప్ప అన్ని పార్టీలు అనుకూలమేనని అన్నారు. ఈ పోరాటాన్ని ఉద్యమం అని ఎలా అంటారని ప్రశ్నించారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రయోజనాలను సాధించలేదని, వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్నారని అన్నారు. ఐదేళ్లుగా పోరాడలేనివారు వచ్చే ఎన్నికల తరువాత ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారని నిలదీశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెండు ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయని, ప్రతి ఓటర్‌కి రెండు వేల రూపాయలు ఇవ్వగలిగే వారికి టిక్కెట్లు దక్కుతాయని అన్నారు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీ టిక్కెట్టు ఇచ్చే అభ్యర్థి ఎన్నికల్లో రూ.1000 సొంతంగా ఖర్చు పెట్టుకోవాలని, మరో రూ.1000 తాము ఇస్తామని చెప్పే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు డబ్బు ఖర్చు పెట్టిన అభ్యర్థిని ఓడించాలని, ఎవరి దగ్గర ఓటర్లు డబ్బులు తీసుకుంటారో వారికి ఓట్లు వేయకూడదని అన్నారు. ఈ రాష్ట్రం బాగు పడాలంటే డబ్బు ఖర్చు పెట్టిన వారు ఓడిపోవాలని అన్నారు.   

  • Loading...

More Telugu News