narasimharaju: నేను అన్నది ఒకటి .. ప్రచారమైంది మరొకటి!: నటుడు నరసింహరాజు
- అప్పట్లో ఎలా మాట్లాడాలనేది తెలిసేది కాదు
- ముక్కు సూటిగా ఉండేవాడిని
- అసలు నా ఉద్దేశం అది
గతంలో గోదావరి జిల్లాలలో తుపాను బీభత్సం సృష్టించింది. దాంతో ఆ ప్రాంత ప్రజలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో, కొంతమంది నటీనటులతో కలిసి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఊరూరా తిరుగుతూ విరాళాలు సేకరించారు. "వాళ్లిద్దరూ ఊరూరా తిరిగి అడగడం దేనికి .. వాళ్లే ఇవ్వొచ్చుగా" అని నరసింహరాజు అన్నట్టుగా అప్పట్లో దినపత్రికల్లో వచ్చింది. ఇది ఎంతవరకూ నిజం? అనే ప్రశ్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో నరసింహరాజుకి ఎదురైంది.
అప్పుడాయన స్పందిస్తూ "అప్పుడు నేను బాగా యంగ్ గా వున్నాను. ఏది మాట్లాడాలో .. ఏది మాట్లాడకూడదో తెలిసేది కాదు. ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉండేవాడిని. నేను అన్నది చిన్నమాటే అయినా అది ఎక్కువగా పబ్లిసిటీ అయింది. విరాళాల కోసం నెల రోజుల పాటు తిరగడం కన్నా, అంతా కలిసి ఒక సినిమాలో చేసి, ఆ సినిమాకి తీసుకునే పారితోషికాలను విరాళంగా ఇవ్వొచ్చు కదా?" అనే ఉద్దేశంతో నేను అన్నాను. అది మరోలా ప్రచారమైంది .. అంతే" అని వివరణ ఇచ్చారు.