safari park: కారులోని పర్యాటకులను భయపెట్టిన జిరాఫీ

  • సఫారీ పార్క్ పర్యటనకు వెళ్లిన జంట
  • విండో లోంచి తలపెట్టిన జిరాఫీ
  • భయంతో కేకలు పెట్టిన జంట 

సఫారీ పార్కులో విహారయాత్రకు వెళ్లిన జంటకు ఓ జిరాఫీ షాకింగ్ అనుభవాన్ని మిగిల్చింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లండ్‌ లోని వార్సెస్టర్‌ షైర్‌ లోని పశ్చిమ మిడ్‌ ల్యాండ్స్‌ సఫారీ పార్కులో జంతువులను చూసేందుకు ఒక జంట తమ కారులో వెళ్లింది. దగ్గరగా కనిపించిన జిరాఫీని చూసేందుకు కారు ఆపారు. విండో అద్దాన్ని సగం దించి, ఆసక్తిగా దానిని చూస్తున్నారు.

అంతే... ఊహించని విధంగా జిరాఫీ కారులో తలదూర్చి ఆ దంపతులు తింటున్న తినుబండారాలను నోటితో లాక్కుంది. దీంతో భయాందోళనలకు గురైన ఆ జంట కేకలు వేయడంతో జిరాఫీ వేగంగా తలను వెనక్కి తీసుకుంది. దీంతో కారు అద్దం భళ్లున పగిలిపోయింది. భయంతో ఆ జంట వెనుదిరిగింది. జిరాఫీకి ఎలాంటి గాయాలు కాలేదని సఫారీ పార్క్ సిబ్బంది తెలిపారు. 

safari park
england
ziraffie
  • Loading...

More Telugu News