Chandrababu: హక్కుల కోసం కేంద్రంపై మన ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారు: టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు
- ఎంపీల పోరాట స్ఫూర్తితో అధికార యంత్రాంగమూ పని చేయాలి
- నరేగా నిధులు సక్రమంగా వినియోగించుకోవాలి
- తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమానికి చేస్తున్న మన కృషిని ప్రజలకి వివరించాలి
మన హక్కుల కోసం కేంద్రంపై ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని అదే స్ఫూర్తితో, ద్విముఖ వ్యూహంతో అధికార యంత్రాంగమూ పనిచేయాలని నీరు-ప్రగతి, వ్యవసాయంపై జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ప్రజలను చైతన్యపరచాలని, తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించాలని అన్నారు. విపత్తు సాయం త్వరితగతిన రైతులకు అందించాలని, ఈఏడాది కేంద్రం నుండి వచ్చే నరేగా నిధులు రూ.10వేల కోట్లు వినియోగించుకోవాలని, ఏదో సాకుతో నిధులు నిలిపివేసే అవకాశం కేంద్రానికి ఇవ్వరాదని ఈ సందర్బంగా చంద్రబాబు తెలిపారు.