Amitabh Bachchan: అర్ధరాత్రి నుంచి శుభాకాంక్షలు తెలపడానికి ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయి: అమితాబ్‌

  • ఈ రోజు జయా బచ్చన్‌ 70వ పుట్టిన రోజు
  • తన బ్లాగ్‌లో ఓ లేఖ రాసిన అమితాబ్
  • తన భార్యను 70వ వసంతంలోకి ఆహ్వానించానన్న బిగ్‌బీ
  • గత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని వ్యాఖ్య

తన భార్య జయా బచ్చన్‌ 70వ పుట్టిన రోజు సందర్భంగా గత అర్ధరాత్రి నుంచి శుభాకాంక్షలు తెలపడానికి తమకు ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయని బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. ఈ రోజు తన బ్లాగ్‌లో ఇందుకు సంబంధించి ఓ లేఖ రాశారు. తన భార్యకు స్వీటు తినిపించి 70వ వసంతంలోకి ఆహ్వానించానని అమితాబ్ అందులో పేర్కొన్నారు. జయా బచ్చన్‌ భార్యగా, తల్లిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తోందని, గతంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా తాను రాసిన లేఖలు, కురిపించిన ప్రేమ వంటి విషయాలన్నీ తనకు ఈ సందర్భంగా గుర్తుకు వచ్చాయని చెప్పారు. కాగా, జయా బచ్చన్‌ ఇటీవల యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన విషయం తెలిసిందే.  

Amitabh Bachchan
jaya bachchan
Twitter
  • Loading...

More Telugu News