mumbai airport: నేడూ, రేపూ ముంబై విమానాశ్రయం రన్ వే మూసివేత.. పెద్ద ఎత్తున సర్వీసుల రద్దు

  • రన్ వేకు మరమ్మతులు
  • ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూత
  • జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ విమాన సర్వీసులకు బ్రేక్

ప్రపంచంలోనే అత్యంత రద్దీతో కూడిన విమానాశ్రయాల్లో ఒకటైన ముంబైలో విమాన రాకపోకలకు నేడు, రేపు అంతరాయం కలగనుంది. మరమ్మతు పనుల కోసం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విమాన రాకపోకలను నిలిపివేస్తున్నారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు రన్ వేను రాకపోకలకు వీలుగా అనుమతిస్తారు. ఈ కారణంగా ఈ రోజు ఇప్పటికే పదుల సంఖ్యలో సర్వీసులు నిలిచిపోయాయి. 70 దేశీయ, విదేశీ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటన చేసింది. తాము 18 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు స్పైస్ జెట్ ప్రతినిధి ప్రకటించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను జీవీకే గ్రూపు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

mumbai airport
runway
  • Loading...

More Telugu News