Ramcharan: రామ్ చరణ్ చెయ్యి పట్టుకోగానే భయంతో వణుకు వచ్చేసింది: సుకుమార్

  • గోదావరి నదిలో ప్రమాదకరమైన షాట్
  • ఆగిన లాంచీ కదలడంతో ఆందోళన
  • తిరుగుతున్న లాంచ్ ఫ్యాన్ దగ్గరకు వచ్చేసిన చరణ్
  • భయంతో వణికిపోయానన్న సుకుమార్

'రంగస్థలం' షూటింగ్ గోదావరి నదిలో జరుగుతున్న వేళ ఓ షాట్ తీసేటప్పుడు తానెంతో భయపడ్డానని, తన గుండె ఆగినంత పనైందని దర్శకుడు సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. లాంచీలో ప్రెసిడెంట్ వెళ్లిపోతుంటే, హీరో నీళ్లల్లో ఈదుతూ లాంచీని పట్టుకునే సీన్ తీయాల్సి వచ్చిందని, తానేమో లాంచీని ఆపి, ఈదుతున్న హీరో ముందు కెమెరాను కదిలించడం ద్వారా సీన్ తీయాలని భావించానని చెప్పాడు. అయితే, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల లాంచీ కదిలిందని, ఈదుకుంటూ లాంచ్ ఫ్యాన్ దగ్గరకు రామ్ చరణ్ వస్తుంటే భయంతో టెన్షన్ పుట్టిందని, తనలో తానే అరిచేసుకున్నానని అన్నాడు. అంతకుముందు అదే షాట్ సరిగ్గా రాకపోతే, ఓసారి గట్టిగా అరిచానని, వెనక్కు వచ్చిన రామ్ చరణ్, మళ్లీ చేద్దామని చెప్పిన వేళ ఈ ఘటన జరిగిందని అన్నాడు. రీటేక్ చేస్తుంటే లాంచీ కదలడంతో భయపడ్డానని, ఈ ఘటన తరువాత రామ్ చరణ్ చెయ్యి పట్టుకుంటే వణికిపోయానని, ఈ విషయాన్ని ఇంతవరకూ చరణ్ కు కూడా చెప్పలేదని అన్నాడు.

Ramcharan
Sukumar
Rangasthalam
Godavari River
  • Loading...

More Telugu News