Sonia Gandhi: వచ్చే ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీల సీట్లు గల్లంతవుతాయి: బీజేపీ

  • అమేథీ నుంచి సోనియా, రాయబరేలీ నుంచి రాహుల్ ఓటమి ఖాయం
  • ఇప్పటికే వారిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది
  • రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ

2019 సాధారణ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీకి భంగపాటు తప్పదన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల సీట్లు గల్లంతవుతాయని బీజేపీ ప్రతినిధి అనిల్ బలూనీ అన్నారు. ఇప్పటికే వారివారి నియోజకవర్లాల్లోని ప్రజల్లో వారిపై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన చెప్పారు. అమేథీ నుంచి సోనియా, రాయబరేలి నుంచి రాహుల్ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. వారి నియోజకర్గాలకు వారు చేసిందేమీ లేదని విమర్శించారు. మరోవైపు, రాహుల్ మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని ఆయన అన్నారు. 

Sonia Gandhi
Rahul Gandhi
defeat
2019 elections
  • Loading...

More Telugu News