Teja: తెలిసీ తెలియకుండా టాలీవుడ్ లోకి రావద్దు: అమ్మాయిలకు దర్శకుడు తేజ సలహా

  • కొత్త రక్తానికి పరిశ్రమ ప్రోత్సాహం
  • ఒక్కో సినిమాలో పది మందికి అవకాశం ఇస్తా
  • అవగాహన లేకుండా వస్తే అవమానాలే
  • దర్శకుడు తేజ

టాలీవుడ్ పరిశ్రమ ఎల్లప్పుడూ కొత్త తరానికి ప్రోత్సాహం అందిస్తుందని, అయితే, యాక్టింగ్, డైరెక్షన్ వంటి అంశాలపై అవగాహన లేకుండా మాత్రం సినిమా రంగంలో కాలు పెట్టవద్దని దర్శకుడు తేజ సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్సును ముగించిన విద్యార్థులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తేజ పాల్గొన్నారు. తాను తీసే ప్రతి సినిమాలో పది మందికైనా కొత్త వారికి అవకాశాలు ఇస్తానని చెప్పారు. తెలిసీ తెలియకుండా సినిమా ఫీల్డ్ లోకి వస్తే, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సి వుంటుందని యువతీ యువకులకు తేజ సలహా ఇచ్చారు. ఎంతో మంది చూసి నేర్చుకుందామని ఈ రంగంలోకి వస్తుంటారని, అయితే, చదివి నేర్చుకుంటేనే సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని చెప్పారు. కొత్త రక్తం ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నవీన ఆలోచనలతో కూడిన సినిమాలు వస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News