Virat Kohli: అదే జరిగితే చొక్కా విప్పేసి ఆక్స్‌ఫర్డ్ నడి వీధుల్లో నడుస్తా: కోహ్లీ

  • ప్రపంచకప్ గెలిస్తే చొక్కా విప్పేస్తా
  • బుమ్రా, పాండ్యాలను కూడా చొక్కాలు విప్పేసి నడిపిస్తా
  • గంగూలీ వ్యాఖ్యలకు కోహ్లీ స్పందన

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే తాను చొక్కా విప్పేసి ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో నడుస్తానని పేర్కొన్నాడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ అనూహ్య విజయం సాధించింది. దీంతో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా తీసేసి మైదానంలో హల్‌చల్ చేయడం అప్పట్లో సంచలనమైంది.

బొరియా మజుందార్ రాసిన ‘ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్’  పుస్తక ప్రారంభోత్సవంలో గంగూలీ మాట్లాడుతూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. ‘‘కెమెరాలు సిద్ధంగా పెట్టుకోండి. వచ్చే ప్రపంచకప్‌లో భారత్ గెలిస్తే కోహ్లీ కూడా షర్టు విప్పేసి తన సిక్స్‌ప్యాక్‌ను చూపిస్తూ ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో నడుస్తాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు.

గంగూలీ వ్యాఖ్యలపై కోహ్ల స్పందిస్తూ.. ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్‌ను భారత్ గెలిస్తే చొక్కా విప్పేసి ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో తిరుగుతానని తేల్చి చెప్పాడు. అక్కడితో ఆగకుండా, తానొక్కిడినే చొక్కా విప్పనని.. హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రాలు కూడా తనతో నడుస్తారని, ఇది 120 శాతం నిజమంటూ నవ్వులు పూయించాడు. బుమ్రాకు కూడా సిక్స్ ప్యాక్ ఉందని, తమతోపాటు మరికొందరు కూడా షర్టులు తీసేస్తారని పేర్కొన్నాడు.

నాట్‌వెస్ట్ ట్రోఫీని భారత్ గెలుచుకున్నప్పుడు కోహ్లీ వయసు 13 ఏళ్లు మాత్రమే. జూలై 13, 2002లో జరిగిన ఈ ట్రోఫీ ఫైనల్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. 325 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఓటమి దిశగా పయనించిన భారత్ చివర్లో  యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్‌లు వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ విజయం సాధించింది.

  • Loading...

More Telugu News