Special Category Status: ఇక పోరు ఉద్ధృతం.. అఖిలపక్ష సంఘాల సమావేశంలో కీలక నిర్ణయాలు

  • త్వరలోనే రాజకీయ పక్షాలు, సంఘాలతో కమిటీ ఏర్పాటు
  • ఏడాదిపాటు ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా నిలపాలని నిర్ణయం
  • నిజాయతిగా పోరాడే వారికి మద్దతుగా ఉండాలని యోచన
  • అందరి అజెండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉండాలని నిర్ణయం

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే లక్ష్యంగా అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన కొనసాగుతోన్న అఖిలపక్ష సంఘాల సమావేశం ముగిసింది. రాష్ట్ర మంత్రులు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, శివాజీ, సచివాలయ, ప్రభుత్వ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉద్యమానికి కలిసొచ్చే రాజకీయ పక్షాలు, సంఘాలతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

అన్ని సంఘాలను కలుపుకుని ముందుకు వెళతామని, రాష్ట్రం ఏకతాటిపై ఉందనే సందేశం ఢిల్లీకి చేరవేయాలని నిర్ణయం తీసుకున్నామని కాల్వ శ్రీనివాసులు అన్నారు. దాదాపు ఏడాదిపాటు ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా నిలపాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ పోరాటంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా కార్యాచరణ ఉండాలని నిర్ణయం తీసుకున్నామని, రెండు కమిటీలు ఏర్పాటు చేసి, అన్ని వర్గాల ప్రజల సమన్వయం, ఉద్యమ మార్గాన్ని నిర్ణయించనున్నామని అన్నారు. అలాగే, రాష్ట్రం కోసం నిజాయతిగా పోరాడే వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News