ys vijayamma: ఢిల్లీకి వెళుతున్న వైయస్ విజయమ్మ

  • రేపు ఢిల్లీకి విజయమ్మ పయనం
  • వైసీపీ ఎంపీల దీక్షా శిబిరాన్ని సందర్శించనున్న విజయమ్మ
  • ఆసుపత్రిలో ఉన్న మేకపాటికి పరామర్శ

వైసీపీ అధినేత జగన్ తల్లి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రేపు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు నిరాహారదీక్ష చేస్తున్న శిబిరాన్ని ఆమె సందర్శించనున్నారు. దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుప్రతిలో చికిత్స పొందున్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని కూడా ఆమె పరామర్శించనున్నారు. జగన్ పాదయాత్రలో ఉండటం వల్ల... ఆయన తరపున విజయమ్మ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు వైసీపీ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. 

ys vijayamma
YSRCP
mps
hunger strike
delhi
trip
  • Loading...

More Telugu News