Salman Khan: సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు

  • బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఊరట
  • రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన జోథ్ పూర్ సెషన్స్ కోర్టు 
  • ఈరోజు రాత్రికి జైలు నుంచి విడుదల కానున్న సల్మాన్

కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ని జోథ్ పూర్ సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, బెయిల్ ఆర్డర్ కాగితాలు జైలు అధికారులకు అందిన అనంతరం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈరోజు రాత్రి ఏడున్నర గంటల సమయంలో సల్మాన్ ని విడుదల చేయవచ్చని సీనియర్ న్యాయవాది భరత్ భూషణ్ శర్మ తెలిపారు. కాగా, ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. జోథ్ పూర్ సెంట్రల్ జైలులో సల్మాన్ నలభై ఎనిమిది గంటలు గడిపాడు.

Salman Khan
jodhpur
  • Loading...

More Telugu News