balka suman: టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ

  • మంచిర్యాలలోని సుమన్ ఇంట్లో చోరీ
  • లక్ష వరకు దొంగతనం జరిగినట్టు సమాచారం
  • గోప్యంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఇంట్లో చోరీ జరిగింది. మంచిర్యాల పట్టణంలోని గౌతమ్ నగర్ లో ఉన్న సుమన్ ఇంట్లో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆయన ఇంటితో పాటు మరో రెండు ఇళ్లలో దొంగతనం జరిగింది. సుమన్ ఇంట్లో రూ. లక్ష వరకు దొంగలు అపహరించినట్టు తెలుస్తోంది. ఈ చోరీ అంశం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ చోరీపై పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే ఆ ప్రాంతంలో రెండోసారి చోరీ జరగడంతో... పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి నియోజకర్గం నుంచి బాల్క సుమన్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

balka suman
theft
mancherial
TRS
  • Loading...

More Telugu News